టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు.. సర్కారు కిందికి..   - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు.. సర్కారు కిందికి..  

May 22, 2020

TTD Online Services Website Renaming .. AP Government

తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరును మార్చారు. ఇన్నిరోజులుగా టీటీడీ సేవా ఆన్‌లైన్ డాట్‌కామ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్ పేరును తిరుపతి బాలాజీ డాట్ గవర్నమెంట్‌గా మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నిరోజులు స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్‌సైట్‌ను ప్రభుత్వ సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు ప్రకటించారు. 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితసేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్ సేవలను బుక్ చేసుకోవడంతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మార్చిన పేరు గల వెబ్‌సైట్ రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కాగా, కొత్త సైట్ అమల్లోకి రానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన విడుదల చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.