బాలాజీ భక్తులకు అలర్ట్.. మరో మార్గం అందుబాటులోకి తెచ్చిన టీటీడీ - MicTv.in - Telugu News
mictv telugu

బాలాజీ భక్తులకు అలర్ట్.. మరో మార్గం అందుబాటులోకి తెచ్చిన టీటీడీ

April 18, 2022

06

తిరుమల బాలాజీని నడక మార్గంలో వెళ్లి దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ మార్గం ధ్వంసమైంది. దాంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయించింది టీటీడీ. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా ఐదునెలల్లో మరమ్మత్తులు పూర్తి చేసినట్టు టీటీడీ సభ్యుడు పోకల అశోక్ తెలిపారు. కాగా, ప్రస్తుతం అలిపిరి నడక మార్గం ఒకటే భక్తులకు అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. సర్వ దర్శనం టిక్కెట్లను రద్దు చేయడంతో భక్తులు భారీగా ఎగబడుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.