TTD says don't give gifts on Garudaseva day
mictv telugu

భక్తులకు టీటీడీ కీలక సూచన.. ఆ కానుకలు మాకు చేరవు

September 6, 2022

టీటీడీ శ్రీవారి భక్తులకు కీలక సూచన చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడ సేవ కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి గొడుగులు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. పలు ధార్మిక సంస్థలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతీసారి లాగే ఈ ఏడాది కూడా ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో గొడుగుల ఊరేగింపు ఉంటుంది. అయితే గరుడసేవ నాడు జరిగే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ భక్తులను కోరింది. ఆ రోజు భక్తులు సమర్పించే కానుకలతో టీటీడీకి సంబంధం ఉండదని, అవి టీటీడీకి చేరవని ప్రకటించింది. ఈ సూచనను గమనించాలని వెల్లడించింది. కాగా, అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అటు తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10 వరకు మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.