తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గురువారం ఉదయం ఓ శుభవార్తను చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించి రూ. 800 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశామని పేర్కొన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి రోజుకు 25వేల చొప్పున టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.
ఈ స్పెషల్ టికెట్లను గురువారం ఉదయం విడుదల చేస్తామని అధికారులు బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రకటించిన విధంగానే కాసేపటిక్రితమే ఆన్లైన్లో వెంకన్న స్వామి వారిని దర్శంచుకోవటానికి స్పెషల్ టికెట్లను టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.inలో విడుదల చేశామని తెలిపారు. కావున భక్తులు వెబ్సైట్ను సందర్శించి ఈ స్పెషల్ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.