శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల

May 20, 2022

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం టీటీడీ ఆన్‌లైన్లలో టికెట్లను విడుదల చేయనుంది. రేపు (శనివారం, మే 21) ఉదయం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ. 300 దర్శన టికెట్లను విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్లో టికెట్లను అందుబాటులో ఉంటాయని వివరించారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరారు.

కాగా వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావ‌డ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్టద‌ళ‌పాద‌ ప‌ద్మారాధ‌న‌ సేవా టికెట్లను జూన్ వరకు ఆన్‌లైన్‌ విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. వారిని అష్టదళ పాదపద్మారాధన సేవకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్‌లో జూన్ 30 వరకు తిరుప్పావడ సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఆయా తేదీల్లో బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నామని, లేదంటే రీఫండ్‌ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.