శ్రీవారికి కనీవినీ ఎరుగని కానుకలు.. ఏకంగా.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారికి కనీవినీ ఎరుగని కానుకలు.. ఏకంగా..

June 6, 2022

తిరుమల శ్రీవారికి భక్తులు కానుకలు, విరాళాలు, మడిమాన్యాలు భారీగా సమర్పించుకోవడం మామూలే. కొందరైతే రికార్డు స్థాయిలో కానుకలు సమర్పిస్తుంటారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి టాటా బిర్లా, అంబానీల వరకు విలువైన నగనట్ర స్వామివారి చేరుతూనే ఉన్నాయి. ఈ వరుసలో ఓ తమిళ భక్తుడు తాజాగా చేరిపోయాడు. ఏకంగా రూ. 7 కోట్ల విరాళాన్ని వెంకన్నకు సమర్పించాడు. మరో ముగ్గురు తమిళనాడు భక్తులు కూడా కోటి చొప్పున అందించారు. ఇటీవలి చరిత్రలో ఒకే రోజు 10 కోట్ల విరాళాలు రావడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. తిరున‌ల్వేలికి చెందిన గోపాల బాల‌కృష్ణన్ రూ.7 కోట్ల విరాళం అందించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఏడు సంస్థలకు కోటి చొప్పన ఖర్చు చేయాలని కోరారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్సెక్ష‌న్ సంస్థ టీటీడీ పాఠశాలలకు రూ.1 కోటి, బాలకృష్ణ ఫ్యుయెల్స్ సంస్థ శ్రీవాణి ట్ర‌స్టుకు రూ.1 కోటి, సీ హబ్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ వేద ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌కు రూ.1 కోటి అందించాయి.