తిరుపతి లడ్డు.. పేపర్ బాక్సులతో జేబులకు చిల్లు..   - MicTv.in - Telugu News
mictv telugu

తిరుపతి లడ్డు.. పేపర్ బాక్సులతో జేబులకు చిల్లు..  

November 20, 2019

Ttd .............

ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై దేశవ్యాప్తంగా  ‌నిషేధం ఉద్యమంలా సాగుతోంది. ప్లాస్టిక్ వాడకానికి టీటీడీ కూడా పూర్తిగా స్వస్తి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి లడ్డు ప్రసాదాన్ని కాగితపు డబ్బాలోనే అందించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కాగితపు పెట్టెలు, జనపనార సంచులను అందుబాటులోకి తెచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదించే కార్యక్రమంలో భాగంగానే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. దశలవారీగా సంక్రాంతి నాటికి తిరుమల కొండపై పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తామని అధికారులు చెబుతున్నారు. 

Ttd .............

లడ్లను ప్యాక్ చేసే బాక్సులపై శ్రీవారి చిత్రపటాలు ముద్రించి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కప్పులు,ప్లేట్ల స్థానంలో పేపర్ కప్పులను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల కోసం సౌకర్యాలు మెరుగు పరిచారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్‌ కోడ్‌ విధానం ద్వారా లడ్లను అందిస్తున్నారు. దీంతో పాటు లడ్డు కవర్లను నిషేధించి ప్రత్యామ్నాయంగా పేపర్‌ బాక్స్‌లు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే కాగితపు డబ్బాల, జ్యుట్ సంచుల ధరలు మాత్రం భక్తులకు షాక్ ఇస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లకు బదులు పర్యావరణ అనుకూలమైన జ్యూట్ సంచులు 5 లడ్లది రూ.25, పది లడ్లది రూ.30, 15 లడ్లది రూ.35, 25 లడ్లది రూ.55గా నిర్ణయించారు. ఇక, అట్టపెట్టలు ఒక లడ్డుది రూ.3, రెండు లడ్లదిరూ.5, నాలుగు లడ్లది రూ.10గా ధరల పట్టికలో పేర్కొన్నారు. దీంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. కాగితపు డబ్బాలు, జ్యూట్ సంచులపై వడ్డన ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Ttd .............