TTD to release special darshan tokens of October quota tomorrow
mictv telugu

శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

August 17, 2022

TTD to release special darshan tokens of October quota tomorrow

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త.. తిరుమలేశుని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఉదయం 9గంటలకు విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసోవద్దని హెచ్చరించింది

అయితే వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.