Home > Featured > శ్రీవారి ఆస్తులను అమ్మేద్దాం.. టీటీడీ వివాదాస్పద నిర్ణయం

శ్రీవారి ఆస్తులను అమ్మేద్దాం.. టీటీడీ వివాదాస్పద నిర్ణయం

TTD

భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కోట్లాది విలువైన భూములను అమ్మేడానికి రంగం సిద్ధమైంది. మొదట తమిళనాడు నుంచి మొదలు పెడుతున్నారు. ఆ రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు నిరర్ధకమంటూ వాటి అమ్మేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈమేరకు పాలక మండలి తీర్మానం చేసింది. అమ్మకం ప్రక్రియ విధివిధానాల కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిని మళ్లీ టీమ్‌ A, టీమ్ Bగా విభజించారు. స్థలాలనున బహిరంగ వేలంలో అమ్మేస్తారు. టీటీడీ అధికారుల రిజిస్ట్రేషన్‌ చేసిస్తారు.

ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్తులను అమ్ముకోవాల్సిన అగత్యం ఏంటని, వైకాపా నేతల కోసం పందేరం వేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. భక్తులు టీటీడీకి నమ్మకంగా ఇచ్చిన స్థలాలను ప్రజోపయోగ పనులకోసం వాడుకోవాలని, ఖాళీగా ఉన్నాయన్న సాకుతో అయిన వారికి కట్టబెట్టడం సరికాదని అంటున్ను. టీటీడీ నిర్ణయాన్ని జనసేన కూడా ఖండిgచింది.

Updated : 23 May 2020 4:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top