TTD's key decision on Sarva Darshan.. revealed by the Chairman
mictv telugu

సర్వ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం.. వెల్లడించిన చైర్మెన్

July 11, 2022

TTD's key decision on Sarva Darshan.. revealed by the Chairman

టీటీడీ పాలక మండలి సోమవారం సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని, రద్దీ తగ్గేంతవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానమే కొనసాగిస్తామని తెలిపారు. అలాగే సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు తిరుమల మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కరోనా తర్వాత ఏ ఏడాదే బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇవి కాక ఈ కింది నిర్ణయాలను పాలక మండలి తీసుకుంది. అవి

1. ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం
2.యంత్రాలతో లడ్డు ప్రసాదం తయారీపై అధ్యయనం
3. దేశ వ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాల నిర్వహణ
4. అమరావతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రూ. 2.9 కోట్లతో పచ్చదనం అభివృద్ధి
5. రూ. 18 లక్షలతో బేడి ఆంజనేయస్వామికి స్వర్ణకవచం
6. రూ. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పది నెలలకు సరిపడా పశుగ్రాసం కొనుగోలు
7. రూ. 2.7 కోట్లతో నూతన పార్వేటి మండపం ఏర్పాటు
8. రూ. 154 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రికి టెండర్ల ఖరారు
9. ఆగస్టు 16 నుంచి 20 వరకు నెల్లూరులో వైభవోత్సవాలు
10. ఆక్టోపస్ భవన నిర్మాణానికి రూ. 7 కోట్లు కేటాయింపు
11. ప్రసాదాల తయారీకి సేంద్రీయ ముడిసరుకు కోసం మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం