కొత్త స్టైల్ తో సల్మాన్ ఈద్ వెల్ కమ్ - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త స్టైల్ తో సల్మాన్ ఈద్ వెల్ కమ్

June 15, 2017


ఎవ్రీ ఇయర్ ఈద్ కు సల్మాన్ ఖాన్ తన సినిమాతో రెడీగా వుంటాడు. పోయిన ఇయర్ సుల్తాన్ సినిమాతో బక్సాఫీస్ దెగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈసారి ‘ ట్యూబ్ లైట్ ’ సినిమాతో వచ్చేస్తున్నాడు. కానీ.. పాకిస్తాన్ లో ఈ సినిమా రిలీజ్ కు అక్కడి డిస్ట్రిబ్యూటర్ లు తీస్కోమని తెగేసి చెప్తున్నారు. సల్మాన్ కు అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలానే వుంది.. మరిలా తన సినిమా రిలీజ్ అవకుండా ఆగిపోతే అక్కడి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు కదా.. సినిమా రిలీజ్ ను అడ్డుకుంటున్న అక్కడి డిస్ట్రిబ్యూటర్ల వాదన ఏంటంటే ఆ సినిమా సబ్జెక్టు అప్పట్లో జరిగిన చైనా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో నడుస్తుందట. కాబట్టి పాకిస్తాన్ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశాలున్నాయని వారి వాదన.

అయితే ఈ సినిమాకి హాలీవుడ్ లో వచ్చిన ‘ లిటిల్ బాయ్ ’ సినిమానే ప్రేరణ అని చెప్తున్నారు. కాకపోతే అందులో చిన్న బాబు యుద్ధానికి వెళ్ళి రాకుండా పోయిన తన అమ్మానాన్నలను వెతుక్కుంటూ వెళ్తాడు . కానీ ఇక్కడ తమ్ముణ్ని వెతుక్కుంటూ అన్న వెళ్తాడు. థ్రెడ్ అదే, నేపథ్యాన్ని మార్చి తీసిని ట్యూబ్ లైట్ లో హీరోయన్ చైనా అమ్మాయి ఝూంఝూం.. పాపం సల్మాన్ కి ఈసారి పాకిస్తానీ ఫ్యాన్స్ నుండి విజిల్స్ రావన్నట్టే !?