కొంపముంచిన ట్యూషన్.. గుంటూరులో 15 మంది చిన్నారులకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

కొంపముంచిన ట్యూషన్.. గుంటూరులో 15 మంది చిన్నారులకు కరోనా

October 2, 2020

Tuition Teacher And Students Positive

కరోనా కారణంగా దేశంలో స్కూళ్లు అన్ని మూసివేసే ఉంచారు. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇంకా మొదలుకానేలేదు. చదువులకు విద్యార్థులు దూరం కాకూడదని ఆన్‌లైన్ క్లాసులు, ట్యూషన్ల పేరుతో విద్యను బోధిస్తున్నారు. ఇదే 15 మంది చిన్నారులను చిక్కుల్లోకి నెట్టింది. ట్యూషన్ టీచర్‌కు కరోనా ఉండటంతో అతని వద్దకు వెళ్లిన వారందరూ వైరస్ బారినపడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూర్‌లో ఇది జరిగింది.  

భట్లూర్‌ గ్రామంలో ట్యూషన్ టీచర్ అనారోగ్య బారిన పడటంతో అతనికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. వెంటనే చిన్నారుల శాంపిళ్లను కూడా సేకరించారు. వారిలో 15 మందికి పాజిటివ్ అని తేలింది. వారంతా ఏడేళ్లలోపు వారే కావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అధికారులు వచ్చి ఎన్‌ఆర్‌ఐ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. తల్లిదండ్రుల్లోనూ కొంత మందిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే ఆ గ్రామంలో సహయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 39 కరోనా కేసులు ఉన్నాయి. ఓ వైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు కూడా అధిక సంఖ్యలో వ్యాధిబారినపడటం కలవరపెడుతోంది.