Tummala Meet With Party Members..No Clariety On Party Change
mictv telugu

తుమ్మల 40ఇయర్స్ ఇండస్ట్రీ

November 10, 2022

Tummala Meet With Party Members..No Clariety On Party Change

టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు దారెటు?పార్టీ మారబోతున్నారన్న వార్తల్లో నిజమెంత?ఆత్మీయ సమావేశంలో పార్టీ మార్పుపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. కేసీఆర్ పై ప్రశంసలు వర్షం కురించిన తమ్మల… భవిష్యత్ కార్యాచరణ ఏంటి?టీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? లేదంటే పార్టీ మారుతారా?తుమ్మల ముందున్న ఆప్షన్లు ఏంటి?

ఆగని ప్రచారం

తుమ్మల నాగేశ్వరరావు కొంతకాలంగా టీఆర్ఎస్‌లో సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీలోనే ఉన్నా యాక్టివ్‌గా పనిచేయడటం లేదు. ఎంతోకాలంగా మారుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరుతారని అప్పట్లో జోరుగా ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ నేతలు కూడా ఖమ్మం జిల్లాలో కీలక నేతలు జాయిన్ కాబోతున్నారని లీక్స్ ఇచ్చారు. ఇదంతా ఇప్పటిదాకా ఏం జరగలేదు. బీజేపీ కాదు తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలూ వచ్చాయి. ఇదీ అబద్ధమే. పార్టీ మారుతున్నారని ఎవరుపడితేవాళ్లు ప్రచారం చేస్తున్నా తుమ్మల మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇటీవల సత్తుపల్లిలో టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొనడం కొత్త చర్చకు దారితీసింది.

ఆత్మీయ సమావేశం

అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ములుగు జిల్లా వాజేడులో ఈ సమావేశం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అయ్యిందని, అందుకే ఆత్మీయ సమావేశమని తుమ్మల చెప్పారు. పార్టీ మార్పుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితులపై చర్చించారు. కార్యకర్తల్ని ఆప్యాయంగా పలకరించిన తుమ్మల…గ్రౌండ్ లెవల్లో పరిస్థితులపై ఆరాతీశారు. పార్టీకి సంబంధం లేకుండా ఈ ఆత్మీయ సమావేశం కొనసాగింది.

విభేదాలే కారణమా?

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో నేతల మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తోంది. నామా నాగేశ్వరరావు, తుమ్మలకు అసలు పడదు.తన ఓటమికి తుమ్మలనే కారణమని నామా బహిరంగంగానే విమర్శలు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్లింతే. టీఆర్ఎస్ లోకి వచ్చాక ఇంకా విభేదాలు ఎక్కువ అయ్యాయి. అందుకే పార్టీ మారాలనే యోచనలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. పిడుగులాంటి వార్త వింటారంటూ ఊరించి ఊరించి తుమ్మల నాగేశ్వరరావు మౌనంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ఆత్మీయ సమావేశంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏమి జరుగుతుందో చూడాలి.