పండ్లు, కూరగాయలే ఈ పిల్లకు డ్రెస్...! - MicTv.in - Telugu News
mictv telugu

పండ్లు, కూరగాయలే ఈ పిల్లకు డ్రెస్…!

September 7, 2017

మనం డ్రెస్సుల మీద రకారకాలు డిజైన్లు, బొమ్మలు చూస్తుంటాం, కొన్ని డ్రెస్సుల మీద పండ్లు కూరగాయల డిజైన్లు కూడా చూస్తుంటాం.కానీ ఈ పిల్ల ఏస్కున్న డ్రెస్సుల్ను చూడున్రి.. అవి డ్రెస్సులు కావు నిజంగా పండ్లు కూరగాయలే..టర్కీకి చెందిన ఒగామే ఆమె బిడ్డకు ఇంట్లో ఉండే కూరగాయలు.. పండ్లతోనే మోడలింగ్‌ చేయిస్తోంది. అయితే వాటితో దుస్తులేమి కుట్టడం లేదు.. కానీ దుస్తులు వేసుకున్నట్లు భ్రమింపజేసేలా ఫొటోలు తీస్తుంది. ఆ ఫోటోలను చూస్తుంటే నిజంగ పిల్ల గ డ్రెస్ వేస్కుందా అని అనిసిస్తుంది.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఒకసారి ఆ బుజ్జి వాళ్ల అమ్మ పుచ్చకాయను కోసి ఒక ముక్కను పట్టుకొని నిల్చుండగా.. కొంచెం దూరంలో ఈ పిల్లవొయ్య నిల్సుందట. పుచ్చకాయ ముక్కను చూస్తే సరిగ్గా అదీ ఆ పిల్లకు గౌను వేసినట్టుగా కనిపించిదట. దీంతో అప్పటి నుంచి అరటి పండ్లు.. ద్రాక్షపండ్లు.. కాలీఫ్లవర్‌.. ఆకు కూరలు.. పూలు ఇలా అన్ని తినేకంటే ముందు అవ్వి చేతుల పట్కొని ఆ బుజ్జిని కాస్తా దూరంలో సరిగ్గా దుస్తులు వేసుకున్నట్లు భ్రమింపజేసేలా కెమెరాను ఫోకస్‌ చేసి ఫోటో తీయడం  ఓ అలవాటుగా మారిపోయింది. ఆ ఫోటోలను  సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నరు, పిల్ల డ్రెస్సులు జూవినోళ్లంత లైకుల మీద లైకులు, కామెంట్లు వెడ్తున్నరు. ఆ బుజ్జికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.