Turkey Moved to west side 5-6 Metres By Earthquakes
mictv telugu

భూకంపాల ధాటికి 6 మీటర్లు కదిలిన తుర్కియే..

February 8, 2023

Turkey Moved to west side 5-6 Metres By Earthquakes

సోమవారం తుర్కియే, సిరియాలలో సంభవించిన శక్తివంతమైన వరుస భూకంపాలతో ఇప్పటివరకు 11 వేల 200 మంది మరణించారు.అయితే నిపుణులు తాజాగా కొత్త విషయాన్ని చెప్తున్నారు. వరుస భూకంపాల వల్ల తుర్కియే దేశ భూభాగం పశ్చిమం వైపు 5 నుంచి 6 మీటర్ల వరకు జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ, తుర్కియే దేశం పశ్చిమం వైపు “సిరియాతో పోలిస్తే ఐదు నుండి ఆరు మీటర్లు జారిపోయే అవకాశం ఉంది” అని చెప్పారు.

అయితే ఇదంతా ప్రారంభ డేటాపై ఆధారపడి చెప్తున్నానని, రాబోయే రోజుల్లో ఉపగ్రహాల ద్వారా మరింత ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూకంప ప్రదేశంలోని మార్పుల గురించి మాట్లాడుతూ, “190 కిలోమీటర్ల పొడవు మరియు 25 వెడల్పుతో భారీ పగుళ్లు ఏర్పడ్డాయని, తొమ్మిది గంటల వ్యవధిలో రెండు సార్లు అత్యంత తీవ్రమైన ఒత్తిడి కలిగిందని వివరించారు. ఈ రెండు కూడా కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిందని తెలిపారు. ప్రాణనష్టంపై భూకంపాల పరిశోధకుడు మిస్టర్ కెల్మాన్ స్పందిస్తూ.. సాధారణంగా, భూకంపాలు ప్రజలను చంపవు, కుప్పకూలిన భవన శిథిలాలు చంపుతాయని అన్నారు. భూకంపాల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి తక్కువ వ్యవధిలో చికిత్స అందించడం అత్యంత ముఖ్యమైన విషయం’అని అభిప్రాయపడ్డారు. కాగా, భారత్‌తో సహా మిగతా దేశాలు తమ రెస్క్యూ టీమ్‌లతో పాటు రిలీఫ్ మెటీరియల్‌ని తుర్కియే, సిరియాలకు పంపించి ఆదుకున్నాయి.