టర్కీ ఎయిర్ పోర్ట్‌లో ఘోరం.. మూడు ముక్కలైన విమానం - MicTv.in - Telugu News
mictv telugu

టర్కీ ఎయిర్ పోర్ట్‌లో ఘోరం.. మూడు ముక్కలైన విమానం

February 6, 2020

b vb n

ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఘోర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓ విమానం ల్యాండ్ అవుతూ ప్రమాదంలో చిక్కుకుంది. పెగాసస్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం రన్ వేపై అదుపుతప్పింది. గాల్లోంచి మరికొద్దిసేపట్లో నేలకు తాకే సమయంలోనే మూడు ముక్కలైంది. వెంటనే దానికి మంటలు అంటుకొని ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే విమానం పై భాగానికి వెళ్లి కిందకు చేరుకున్నారు. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 179 మంది ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. పెద్దగా ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో ఎక్కువ మంది టర్కీలు ఉండగా 22 మంది 12 దేశాలకు చెందిన వారు ఉన్నట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. పైలెట్ కోలుకున్న తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.