Turkey-Syria Earthquake: Teen Rescued after 248 hours
mictv telugu

Turkey-Syria Earthquake : శిథిలాల కింద సజీవంగా 9 రోజులు..

February 16, 2023

Turkey-Syria Earthquake: Teen Rescued after 248 hours

తుర్కియే, సిరియా దేశాలను వరుస భూకంపాలు కుదిపేశాయి. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మరణించిన వారు 41వేలకు పైగానే ఉన్నారు. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఎటు చూసినా గుండెను పిండే దృశ్యాలు కనిపిస్తున్నాయి.నిర్వాసితులైన ప్రజలు గడ్డ కట్టించే చలిలో కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి నెలకొంది.

భూకంప బాధితుల కోసం వివిధ దేశాల రెస్క్యూటీంలు తమ సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీస్తున్నారు. భూకంపం వచ్చి 9 -10 రోజులు కావస్తున్నా ఇప్పటికీ పలువురు ప్రాణాలతో బయటపడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బుధవారం తుర్కియేలోని కహ్రామనమారస్‌లో శిథిలాల కింద చిక్కుకున్న 45 ఏళ్ళ మెలికే ఇమామోగ్లు, 74 ఏళ్ల సెమిలే కెకెక్ అనే ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటకు వచ్చారు. వారిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. ఈ రోజు(గురువారం) కూడా ఎరిల్మాజ్ అనే మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ముస్తఫా అనే 13 ఏళ్ల బాలుడిని కూడా సహాయక బృందాలు రక్షించాయి. 228 గంటల తర్వాత కూడా పలువురు ప్రాణాలతో బయటకు రావటం ఊరటనిస్తోంది.