షాకింగ్..కన్న కొడుకునే చంపేసిన ఫుట్‌బాల్ దిగ్గజం - MicTv.in - Telugu News
mictv telugu

షాకింగ్..కన్న కొడుకునే చంపేసిన ఫుట్‌బాల్ దిగ్గజం

May 15, 2020

VNGN

కన్న కొడుకునే కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. చంపింది సాదాసీదా మనిషి కూడా కాదు ఓ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ కావడం గమనార్హం. టర్కీకి చెందిన 32 ఏళ్ళ కెవెర్ టోక్టాస్, తన కన్న కొడుకుని హతమార్చాడు. ఆ తరువాత పోలీసులకు చిక్కకుండా తన కొడుకు కరోనా వైరస్ తో మరణించాడని అందరినీ నమ్మించాడు. కానీ, ఇంతలో ఏమైందో ఏమో పశ్చాత్తాపానికి గురై పోలీసుల ముందు నిజం కక్కాడు. 

కరోనా లక్షణాలు కనిపించిన కారణంతో గత నెల 23న తన ఐదేళ్ల కొడుకు ఖాసిమ్ తో కలిసి నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ లోని ఓ హాస్పిటల్ లో కెవెర్ టోక్టాస్ చేరాడు. కరోనా పరీక్షల్లో ఇద్దరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ డాక్టర్లు ఇద్దరిని ఐసోలేషన్ లో ఉంచారు. అయితే ఈ నెల 4న ఖాసిమ్ గదిలో ఉండడాన్ని గమనించి అతని గదిలోకి టోక్టాస్ వెళ్ళాడు. కన్న కొడుకని కూడా చూడకుండా ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశాడు. కొంచం సమయం తరువాత ఖాసీమ్ ను వైద్యులు ఐసీయూకు తరలించినా, ప్రాణాలు దక్కలేదు. కొడుకంటే తనకు ఇష్టం లేదని, అందుకే చంపేశానని, తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని టోక్టాస్ పోలీసుల ముందు చెప్పాడు. పోలీసులు టోక్టాస్ ను అదుపులోకి తీసుకున్నారు.