Home > Featured > స్టేజ్ పైనే జుట్టు కత్తిరించుకొని టర్కీష్ సింగర్ నిరసన

స్టేజ్ పైనే జుట్టు కత్తిరించుకొని టర్కీష్ సింగర్ నిరసన

హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆ దేశ మహిళలకు టర్కీ ప్రముఖ సింగర్‌ మెలెక మొసో మద్దతు తెలిపారు. స్టేజీపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్‌ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. దీంతో సింగర్ జుట్టు కత్తిరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు మెలెక్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. తమ ఉద్యమానికి ఆమె ఈ విధంగా మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌లో మహసా అమినీ అనే యువతిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో గాయపడ్డ అమినీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 17న మరణించింది. అయితే పోలీసులు హింసించడంతోనే ఆమె చనిపోయిందని ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపింది. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఇప్పటివరకు 75 మంది నిరసనకారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు ఇతర దేశాల్లోని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.

Updated : 28 Sep 2022 3:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top