ఐదు గిన్నీస్ రికార్డులు సాధించిన పాతికేళ్ల అమ్మాయి.. మనవల్ల కాదులే! - MicTv.in - Telugu News
mictv telugu

ఐదు గిన్నీస్ రికార్డులు సాధించిన పాతికేళ్ల అమ్మాయి.. మనవల్ల కాదులే!

May 4, 2022

టర్కీకి చెందిన పాతికేళ్ల అమ్మాయి రుమెయ్సా గెల్గి ఐదు గిన్నీస్ రికార్డులన తన పేర లిఖించుకుంది. భూమ్మీద జీవించి ఉన్న మహిళల్లో ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తిగా (215.16 సెం. మీ, 7.07 ఫీట్లు) రికార్డు సృష్టించింది. అంతేకాక, మరో నాలుగు రికార్డులను సాధించింది. అవేంటంటే

పొడవైన వేలు : 11.20 సెంటీ మీటర్లు
పొడవైన కుడి చేయి : 24.93 సెంటీ మీటర్లు
పొడవైన ఎడమ చేయి : 24.26 సెంటీ మీటర్లు
పొడవైన వీపు : 59.90 సెంటీ మీటర్లు.

పై రికార్డులన్నీ కూడా జీవించి ఉన్న మహిళలతో పోల్చి చూశారు గిన్నీసు వాళ్లు. ఈ విషయాన్ని యూట్యూబ్ ద్వారా వెల్లడించారు. కాగా, జన్యులోపం వల్ల ఇలా జరిగిందని గెల్గి చెప్తోంది. దాంతో నడవాలంటే వాకర్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాక, దృష్టిలోపం వల్ల ఎక్కువ దూరం వెళ్లలేదు.