Home > ఆరోగ్యం > పసుపుతో ఎన్నో లాభాలు…

పసుపుతో ఎన్నో లాభాలు…

పసుపు సౌందర్య సాధనం . పసుపు, చందనం… రెండింటినీ పాలమీగడతో కలిపి, ముఖానికి రాసుకుని అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగితే ముఖ వర్చస్సు పెరుగుతుంది.
పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటినీ 2 గ్రాముల చొప్పున తీసుకుని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

10 గ్రాముల పచ్చిపసుపు చూర్ణాన్ని, 40 గ్రాముల ఆవుపెరుగుతో కలిపి రోజూ ఉదయం వేళ సేవిస్తే కామెర్లు తగ్గుతాయి. అయితే ఈ స్థితిలో ఆహారంలో కారం, పులుపు, మసాలాలు లేకుండా తీసుకోవాలి.

పసుపు వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను రెండేసి గ్రాముల చొప్పున తీసుకుని వాడితే క్రిమి రోగాలు, చర్మ వ్యాధులు నయమవుతాయి.

పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్ట చూర్ణం సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా చేసి… గాయాలు, మొటిమలపై పట్టీ వేస్తే ఇట్టే తగ్గిపోతాయి. చర్మ వ్యాధులూ మాయమవుతాయి.

Updated : 23 May 2017 12:37 AM GMT
Next Story
Share it
Top