ఎమ్మెల్యేపై మంత్రి హరీష్ రావుకు జర్నలిస్టుల ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యేపై మంత్రి హరీష్ రావుకు జర్నలిస్టుల ఫిర్యాదు

May 22, 2020

Tuwj complaint about mla bhupal reddy

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి వెయ్యి మందితో బర్త్ డే వేడుక నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ ఉదంతాన్ని పరమేశ్వర్ అనే ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు. దీంతో పరమేశ్వర్ పై ఎమ్మెల్యే కక్ష్యగట్టి దౌర్జన్యంగా ఇంటి నిర్మాణాన్ని కూల్చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) సభ్యులు ఆర్థిక మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే చర్యను టీయూడబ్ల్యూజే సభ్యులు తీవ్రంగా ఖండించారు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ పరమేశ్వర్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు కానీ, బెదిరింపు చర్యలు కానీ జగకుండా చూడాలని జర్నలిస్టు యూనియన్ నాయకులు మంత్రి హరీష్ రావును కోరారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టీఈఏంజేయు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, టీయూడబ్ల్యూజే హైద్రాబాద్ అధ్యక్షుడు పి.యోగానంద్, తెంజు హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి. సంపత్, టీయూడబ్ల్యూజే ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షు విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, యోగనంద్ రెడ్డి, ధారసింగ్ తదిరతరులు ఉన్నారు.