ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు..!

August 18, 2017

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) కొత్త కార్యాలయాన్ని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వాటర్స్ లో.. మంత్రులు హరీష్ రావ్,లక్ష్మారెడ్డి ,మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి,డిజిపి అనురాగ్ శర్మ ,వరంగల్ మేయర్ బండ నరేందర్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది,జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది,గత ప్రభుత్వాలు మన విజ్ఝప్తులను విస్మరించాయి,తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు పాత్ర మరువలేనిదని క్రాంతి కుమార్ అన్నారు.

హరీష్ రావ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం విషయం లో సిఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారు..100 కోట్ల తో జర్నలిస్టుల సంక్షేమా నిధిని ఏర్పాటుచేసిన ఘనత ప్రభుత్వానిది…అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళుతుంది…సుప్రీం కోర్ట్ తీర్పు రాగానే ఇళ్ల స్థలాల పై నిర్ణయం తీసుకుంటాం,సమాజం కొరకు అహర్నిశలు పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమం విషయం తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది,ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాల్సిన బాధ్యత జర్నలిస్టుల పై ఉంది అని అన్నారు.

అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్థులతో సమానంగా హెల్త్ కార్డ్ లను మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది…జర్నలిస్ట్ ఫండ్ కింద 60 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత కూడా ప్రభుత్వానిది…101 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది,నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కూడా త్వరలోనే హెల్త్ కార్డుల మంజూరు చేస్తామని చెప్పింది…ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని అన్నారు.

మినిస్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..దేశం లో ఎక్కడ లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుంది…త్వరలోనే జిల్లా కేంద్రాల్లో వెల్ నెస్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తాం…ప్రతి ఒక్క వర్గానికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి…ఎన్నో ఏండ్ల నుండి పట్టి పీడిస్తున్న సమస్యలను ప్రభుత్వం నిర్ములిస్తుంది,సమాజం లో జర్నలిస్టుల పాత్రా కీలకమైనది,అని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం లో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైంది…రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అభివృద్ధి పథంలో లో దూసుకపోతోంది…అవినీతి రహిత పాలనను అందిస్తున్న ఘనత ప్రభుత్వానిదని  ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు.