కంగ్రాట్స్ టీయూడబ్ల్యూ జే
జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే టీయూడబ్ల్యూజే మరో ముందడుగు వేసింది. పట్టుబట్టి మరి ఏసీ బస్సుల్లో జర్నలిస్టులకు రాయితీ ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది. రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందిన వారికి ఏసీ బస్సులో ప్రయాణించే జీఓను విడుదల చేయించింది. అలాగే డిగ్రీ అర్హత ల మినహాయింపు, రిటైర్డ్ మరియు అక్రిడిటేషన్ లేని వారికి హెల్త్ కార్డు ల జారీ కి గైడ్ లైన్స్ తయారీకి కమిటీ ఏర్పాటు కు సంబంధించిన జి. ఓ. కూడా రెండురోజుల్లో రాబోతోంది. పెండింగ్ సమస్యల పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బుధవారం సెక్రెటరీయేట్ లో సమావేశం జరిగింది.
ఉన్నతాధికారుల తో పాటు ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నేతలు క్రాంతి కిరణ్, పల్లె రవి సెక్రెటరీయేట్ నేతలు సూరజ్, చిక్కుల శ్రీనివాస్, రమణ, సారధి, మహేష్ లు కూడా ఈ సమావేశానికి హాజరై ఉన్నతాధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టీయూడబ్ల్యూజే నేతలు… జర్నలిస్టులు వీటిని సద్వీనియోగం చేసుకోవాలని కోరారు.