లైవ్‌లో తిట్టుకున్న న్యూస్ యాంకర్లు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

లైవ్‌లో తిట్టుకున్న న్యూస్ యాంకర్లు.. వీడియో వైరల్

February 27, 2018

మనం ఇంట్లో ఎలా తిట్టుకున్నా, గొడవలు చేసుకున్నా బయటి వారికి సమస్య లేదు. అయితే పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేకపోతే ఈ పాకిస్తాన్ న్యూస్ యాంకర్ల మాదిరి అందరిముందు నగుబాట్లు కాక తప్పదు. ఓ టీవీ చానల్ లైవ్ కార్యక్రమంలో వీరు.. తమ ముందు కెమరా ఉందన్న సంగతి మరచిపోయి తిట్లకు లంకించుకున్నారు.

లాహోర్ కేంద్రంగా పనిచేస్తున్న సిటీ42 చానల్ లో పనిచేస్తున్న యాంకర్లు వార్తలు చదువుతుండగా, వారి మధ్య కక్షలు భగ్గమన్నారు. ‘ఈమెకు బుద్ధలేదు. ఈమెతో కలసి వార్తలు చదవడం నా వల్ల కాదు’ అని మగ యాంకరుడు విసుక్కున్నాడు. ఆమెకూడా తక్కువ తినలేదు. ‘ఓయ్.. మర్యాదగా మాట్లాడు.. నువ్వో మూర్ఖుడివి. నీతో పనిచేయడం నా వల్ల కూడా కాదు..’ అని దూషణలకు లంకించుకుంది యాంకరి.

ఇదంతా రికార్డు అవుతున్నట్లు తర్వాత ఇద్దరికీ తెలిసి గతుక్కుమన్నారు. ఇదంతా రికార్డు చేశారని అని ఆడ యాంకర్ కెమరా సిబ్బందిని అడగడం కూడా వీడియోలో కనిపిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.