టీవీ సీరియల్ మైకంలో మహిళ..ఇంటికి నిప్పంటుకొని సజీవదహనం - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ సీరియల్ మైకంలో మహిళ..ఇంటికి నిప్పంటుకొని సజీవదహనం

February 20, 2020

cfnbcn

టీవీ సీరియల్ వస్తుందంటే చాలా మంది మహిళలు తమను తామే మర్చిపోతారు. చుట్టూ ఏం జరుగుతున్నా కూడా వారు పట్టించుకోరు. ఇలాగే ఓ మహిళ టీవీ సీరియల్ మైకంలో పడి ప్రాణాలను వదిలింది. ఓపక్క తన ఇంటికి నిప్పంటుకుని తగలబడి పొతున్నా తెలుసుకోకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  తమిళనాడులోని తిరువొత్తియూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కామరాజపురం, భగత్ సింగ్ స్ట్రీట్ కు చెందిన రమేశ్, మహాలక్ష్మి (41) దంపతులు కాగా, మహాలక్ష్మి భర్తతో విడిపోయి, తన బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటోంది. సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించి సీరియల్ చూస్తూ ఉండిపోయింది. కొంత సేపటికి ఆ దీపం  కస్తా ఒకపక్కకు ఒరిగిపోయింది. ఆ మంటలు కాస్త ఇంటికి అంటుకున్నాయి. చాలా సేపటి వరకూ ఆమె వాటిని గుర్తించలేదు. కొంతసేపటికి తేరుకొని చూడగా ఇళ్లు కాలిపోతుందని గుర్తించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే అగ్ని విజృంభించడంతో ఆ మంటల్లోనే ఆమె కూడా సజీవ దహనమైంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.