టీవీ5 సాంబశివరావు గలీజు మాటలపై పోలీసులకు ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ5 సాంబశివరావు గలీజు మాటలపై పోలీసులకు ఫిర్యాదు

March 24, 2018

ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చలో సినిమా పరిశ్రమను, మహిళలను కించపరుస్తూ అసభ్యవ్యాఖ్యలు చేసిన టీవీ 5 చానల్ వ్యాఖ్యాత సాంబశివరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై చర్య తీసుకోవాలని చంపాపేట్‌కు చెందిన సుస్మితా కృప అనే యువతి శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సాంబశివరావు వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలోని మహిళలనే కాకుండా మొత్తం స్త్రీజాతినే అవమానించినట్లు ఉన్నాయన్నారు.

 

ప్రత్యేక హోదాపై శుక్రవారం నిర్వహించిన చర్చలో సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళితో సాంబశివరావు మాట్లాడారు. ‘మీ సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా? లంజముండలు లేరా?’ అని అన్నారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వేలమంది చూసే ప్రోగ్రాంలో ఇలా మాట్లాడ్డమేంటని, మీ ఇంట్లోనూ ఇదే భాష మాట్లాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.