రవిప్రకాశ్ లాయర్ ఇంట్లో పోలీసుల సోదాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

రవిప్రకాశ్ లాయర్ ఇంట్లో పోలీసుల సోదాలు..

May 18, 2019

Tv9 case telangana police raids in raviprakash’s lawyer kanakaraju house relating to forgery allegations  .

టీవీ9 కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, మరో నిందితుడు శివాజీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దూకుడు పెంచారు. ఈ రోజు సాయంత్రం రవిప్రకాశ్ న్యాయవాది జే. కనకరాజు ఇంట్లో సోదాలు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఆకస్మికంగా ఇంటికి చేరుకుని ఇల్లంతా వెతికారు.

సోదాల్లో కొన్ని కీలక ఆధారాలు దొరికాయని, వివరాలను రేపు వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు. తాము స్వాధీనం చేసుకున్నవాటిలో టీవీ9 యాజమాన్య మార్పుకు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. నకిలీ డాక్యుమెంట్లను తయారీలో కనకరాజు రవిప్రకాశ్‌కు సాయం చేశారని పోలీసులు చెబుతున్నారు. రవిప్రకాశ్, శివాజీలు విజయవాడలో రహస్య స్థావరంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. లుకౌట్ నోటీసులతో వారు విదేశాలకు పారిపోయే పరిస్థితి లేదని, రేపోమాపో పోలీసుల ఎదుట లొంగిపోతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.