రవి ప్రకాశ్‌కు బెయిల్ మంజూరు - MicTv.in - Telugu News
mictv telugu

రవి ప్రకాశ్‌కు బెయిల్ మంజూరు

October 17, 2019

Ravi Prakash .

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రవి ప్రకాశ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం .. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీచేసింది. ఏబీసీఎల్‌ ఖాతాల నుంచి రూ.18కోట్లు అక్రమంగా తీసుకున్నారన్న అభియోగాలపై రవిప్రకాశ్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. 

మరోవైపు నకిలీ మెయిల్‌ ఐడీ సృష్టించి రవిప్రకాశ్ మోసం చేశారని ఫిర్యాదు అందడంతో  సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై గురువారం మరో కేసు నమోదైంది. రవిప్రకాశ్‌ జైలు నుంచి విడుదల కాగానే ఈకేసులో ఆయనను పోలీసులు విచారించనున్నారు.