పారిపోలేదు, వడదెబ్బ తగిలింది.. శివాజీ - MicTv.in - Telugu News
mictv telugu

పారిపోలేదు, వడదెబ్బ తగిలింది.. శివాజీ

May 18, 2019

టీవీ9 కేసులో తెలంగాణ పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులు పనిచేస్తున్నాయి. తాను ఎక్కడికీ పారిపోలేదని నిందితుడైన నటుడు శివాజీ చెప్పారు. కేసుపై తొలిసారిగా ఆయన స్పందిస్తూ ఈ రోజు వీడియోలను విడుదల చేవారు.

‘నేనెక్కడికీ పారిపోలేదు. వడదెబ్బ తగలడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాను. నాకూ, రవిప్రకాశ్‌కు మధ్య అగ్రిమెంట్ జరిగిన మాట నిజమే. కోర్టు పరిధిలో ఉన్న చిన్న సివిల్‌ కేసుపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి కేసులను నాపై వంద పెట్టిన భయపడను. నేను టీవీ9 షేర్లను 2018 ఫిబ్రవరిలోనే కొన్నాను. ఇప్పుడు యాజమాన్యం మారింది కాబట్టి నా షేర్లపై రవిప్రకాశ్‌తో అగ్రిమెంట్‌ రీరైట్‌ చేసుకున్నాను. అలంద మీడియా నాపై సిల్లీ కేసు పెట్టింది.  దాన్ని ఏదో క్రిమినల్‌ కేసుగా మారుస్తూ కుట్రలు చేస్తున్నారు.. ’ అని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికలపై తాను చేసిన విమర్శలు తట్టుకోలేక తనపై వేధింపులకు పాల్పడుతున్నార ఆరోపించారు.

ఫోర్జరీ, ఇతర కేసులో నిందితులైన రవిప్రకాశ్, శివాజీలు విదేశాలకు పారిపోకుండా సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో శివాజీ స్పందించారు. వారిని పట్టుకోడానికి మూడు బృందాలు రంగంలోకి దిగాయి.