రవిప్రకాశ్ గుడ్‌బై.. టీవీ9కు కొత్త సీఈఓ.. - MicTv.in - Telugu News
mictv telugu

రవిప్రకాశ్ గుడ్‌బై.. టీవీ9కు కొత్త సీఈఓ..

May 10, 2019

టీవీ9 ఛానల్‌కు కొత్త సీఈఓ, సీవోవోలను నియమిస్తూ అసోసియేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌) నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీఈవోగా టీవీ9 కన్నడ ఛానల్‌ హెడ్‌ మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం టీవీ9 కార్యాలయంలో ఏబీసీఎల్ డైరెక్టర్లు సమావేశం అయ్యారు. ఈ మేరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ భాగస్వాముల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో ప్రస్తుతం సీఈవోగా ఉన్న రవిప్రకాశ్‌ స్థానంలో మహేంద్రమిశ్రాను నియమించారు.

Tv9 gets new CEO... Ravi Prakash Removed... Era Ends In TV 9.

టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రవిప్రకాశ్‌ గుడ్‌బై చెప్పేసినట్టే. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో పలువురిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. మోసాలు, కుట్రలు చేసి దొడ్డిదారిలో టీవీ9లో చొరబడ్డారు. తప్పుడు ఫిర్యాదులు, కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు’ అని ఆరోపించారు.