టీవీ9 రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు! - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ9 రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు!

May 10, 2019

ఫోర్జరీ కేసులో టీవీ9పై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. సొంత లబ్ధి కోసం ఛానల్‌కు సంబంధించి నకిలీపత్రాలు సృష్టించారని, ఫోర్జరీ చేశారని గత నెల 24న అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లలో పోలీసులు నిన్న సోదాలు నిర్వహించారు.

TV9 Raviprakash once again notices.

ఇవాళ  ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. నేడు మధ్యాహ్నం టీవీ9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రవిప్రకాశ్‌, శివాజీ ఇప్పటి వరకూ విచారణకు హాజరుకాలేదు. వీరిద్దరూ ఇవాళ విచారణకు హాజరుకాకపోతే శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూసి మరోసారి నోటీసులు జారీ చేయాలని సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.