టీవీ9 ని ఎన్నిసార్లు అమ్ముతార్రా నాయనా..! - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ9 ని ఎన్నిసార్లు అమ్ముతార్రా నాయనా..!

June 21, 2017

టీవీ9 పేరు లోనే తొమ్మిది ఉంది కదా అనుకున్నారో… అడ్డమైనోడు అమ్మేస్తున్నాడు. తొమ్మిది సార్లు కాదు ఏమి అనకపోతే తొంబైసార్లు అమ్మేసేటట్టు ఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని మూడ్ వచ్చినప్పుడల్లా సేల్ డీల్ చేసేస్తున్నారు. పోస్టింగుల్ని షేర్ చేస్తున్నారు. ఓరి నాయనో మేం అమ్మం అని టీవీనైన్ మేనేజ్ మెంట్ మొత్తుకుంటున్నా..సోషల్ మీడియా సోదిగాళ్లు ఊరుకోవడం లేదు. అమెజాన్ లో వస్తువులు అమ్మినంత ఈజీగా అమ్మేస్తున్నారు. ఎందుకిలా పుకార్లు పుట్టిస్తున్నారు…?వీటి వెనుక ఉన్నది ఎవరు..?అస్సలు అమ్మే ఉద్దేశమే లేనప్పుడు రూమర్స్ ఎందుకు వస్తున్నాయి..?

టీవీ నైన్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రెండ్ సెట్టర్. ట్యాగ్ లైన్ లో ఫర్ ఏ బెటర్ సోసైటీ అని ఉన్నా.. ఎవ్రీ అవర్ సెన్సేషనే. అప్పటికి ఇప్పటికి ఎప్పుడూ నెంబర్ వన్. మధ్య మధ్యలో రేటింగ్ అంకెల్లో తేడా వచ్చినా లాంగ్ లైఫ్ లో దాన్ని కొట్టే దమ్మున్న చానల్ లేదు.దాన్ని బ్యాక్ బోన్ రవి ప్రకాష్. మండే సూర్యుడిలా నిత్య వెలుగులు నింపుతుంటాడు. జనం కూడా తిడుతూనే టీవీనైన్ ను తప్పక చూస్తారు. కొందరైతే అందులో వస్తే నే వార్త హైలైట్ అవుతుందని అనుకుంటారు. మిగతా తోపు చానళ్లు దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతాయి. ఈ సోది నుంచి పక్కకు టర్న్ తీసుకుంటే…సోయి లేని సోదోళ్లు టీవీ9 పై రూమర్స్ పుట్టిస్తున్నారు. ఓ సారి మై హోమ్ వాళ్లకు అమ్మారని..తెలంగాణ దొరల చేతుల్లోకి టీవీనైన్ వెళ్లిందని అని.. మరోసారి పీవీపీ ప్రసాద్ 4 వందల కోట్లకు అడిగారని,ఇంకోసారి స్టార్ టీవీ కొన్నదని..రీసెంట్ గా జీ టీవీ నెట్ వర్క్ డీల్ కన్ ఫామ్ అయిందని…లాస్ట్ మినిట్ లో డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో ఆగిపోయిందని సోషల్ మీడియాలో అచ్చేశారు. అంతే ఈ ఎఫెక్ట్ తోనే డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా టీవీ నైన్ టోటల్ గ్రూప్ వార్తలు ఇచ్చిందని జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత జీ నెట్ వర్క్ వాళ్లు ఆఫీసుకు వస్తున్నారని…కొన్ని నెలల తర్వాత వారే చూసుకుంటారని టాక్ వినిపించింది. ఇందులో భాగంగా రవిప్రకాష్ ఎన్టీవీ చైర్మన్ ను కలిశారని..వారం పాటు ఆ టీవీ ఆఫీసుకెళ్లారని టీవీ నైన్ ఉద్యోగులే చెబుతుంటారు. ఆ తర్వాత మళ్లీ టీవీ 9కి వచ్చారని ,అన్ని సర్దుకున్నాయని కూడా చెబుతూ వచ్చారు.

లేటేస్ట్ గా మరో రూమర్ వైరల్ అవుతోంది.ఆ పోస్టు ఉన్నది ఉన్నట్టుగా కింద ఇస్తున్నాం….

టీవీ9 పేరుతో తెలుగు, కన్నడ, గుజరాత్‌, మరాఠీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీవీ వార్తా ఛానల్స్‌ నిర్వహిస్తున్న ‘అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (ఎబిసిఎల్‌) త్వరలో చేతులు మారనుంది. కంపెనీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు నాలుగు మీడియా సంస్థలతో జరుగుతున్న చర్చలు నెల రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయని విశ్వసనీయ సమాచారం. ఎబిసిఎల్‌ ఈక్విటీలో ప్రస్తుతం 80 శాతం వాటా వెంచర్‌ క్యాపిటలిస్టు చింతలపాటి శ్రీని రాజు నిర్వహణలోని పీపుల్‌ క్యాపిటల్‌ ఎల్‌ఎల్‌సి, అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ (పిఇ) సంస్థ సైఫ్‌ పార్ట్‌నర్స్‌ చేతిలో ఉంది. మిగతా 20 శాతం కంపెనీ సిఇఒ రవి ప్రకాష్‌, ఇతరుల చేతుల్లో ఉంది. జీ టీవీతో సహా దేశంలోని నాలుగు ప్రధాన మీడియా సంస్థలు ఈ 80 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం పిడబ్ల్యుసి, డెలాయిట్‌, కెపిఎంజి, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ వంటి ఆర్థిక సేవల కంపెనీలు.. ఎబిసిఎల్‌ విలువను లెక్కిస్తున్నట్టు సమాచారం. వారం, పది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక ఉన్నతాధికారి చెప్పా రు. ఈ సంస్థల నివేదికల ప్రకారం నాలుగు కంపెనీలు ఎబిసిఎల్‌ కొనుగోలు కోసం బిడ్స్‌ సమర్పించనున్నాయి. ఇందులో అత్యధిక ధర కోట్‌ చేసే కంపెనీ ఆఫర్‌ నచ్చితే ఎబిసిఎల్‌ ఈక్విటీలో ఆ కంపెనీకి 80 శాతం వాటా దక్కనుంది.

వాల్యుయేషనే కీలకం అయితే ఈ డీల్‌ ద్వారా ప్రధాన ప్రమోటర్లు ఎంత ధర ఆశిస్తున్నారన్నదే కీలకంగా మారింది. సాధారణంగా వెంచ ర్‌ క్యాపిటలిస్టులు, పిఇ సంస్థ లు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశాక ఏడెనిమిది సంవత్సరాల్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. అయితే టీవీ9 విషయంలో మాత్రం ప్రధాన ఇన్వెస్టర్లు 12 ఏళ్ల పాటు తమ పెట్టుబడులు కదపకుండా ఎదురు చూస్తున్నారు. టీవీ 9 తెలుగు, కన్నడ న్యూస్‌ ఛానల్స్‌ ఇప్పటికీ ఆయా భాషల్లో రేటింగ్‌ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయి. టీవీ9 గుజరాతీ, మరాఠి, జై తెలంగాణ ఛానల్స్‌కూ చెప్పుకోదగ్గ స్థాయిలో వీక్షకుల ఆదరణ ఉంది. దీంతో ఈ డీల్‌ విలువ రూ.850 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇదీ ఆ వైరల్ పోస్టు..సూపర్ రైటప్.. ఎన్నిసార్లు టీవీనైన్ అమ్ముతార్రా నాయనా…ఇందులో ఏదీ వాస్తవం ఏదీ అబద్దమో తెలియక జర్నలిస్టులు, జనం బుర్రులు వేడిక్కెతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన వైరల్ పోస్టుల్లో ఏదీ నిజం కాలేదు. ఇప్పుడు ఒకవేల నిజంగా నిజమే అయినా నమ్మిస్థితిలో లేరు. సో ఎలక్ట్రానిక్ మీడియా ట్రెండ్ సెట్టర్ రవిప్రకాశ్ స్వయంగా అనౌన్స్ చేస్తే గానీ రూమర్స్ కు పులిస్టాప్ పడదు.లేదంటే నెలకో పోస్ట్ ఇలా వస్తూనే ఉంటుంది.

లేటెస్ట్ గా వైరల్ పోస్ట్ చూశాక …రవిప్రకాష్ పై మరో రూమర్ క్రియేట్ అయింది. ఆ మధ్య ఎన్టీవీ చైర్మన్ తో కలిసి రవిప్రకాష్… పవన్ కల్యాణ్ సినీ వేదికపై మెరిశారు. రవిప్రకాష్ మాట్లాడిందే మూడు ముక్కలైనా జన సేనానికి రాజకీయ మార్గనిర్దేశం చేసినట్టు ఉంది. అంటే షార్ట్ కట్ లో చెప్పాలంటే.. 2019 ఎన్నికల్లో ఏపీ సీఎం గా పవన్ కల్యాణ్ ని చూడాలని ఆయన మాటల్లో అర్థం..అప్ కోర్స్ ఆయన అదే ఆశిస్తూ ఉండొచ్చు. కానీ ఇది అయ్యే పనేనా..?అయినా మనకెందుకులే.. ఒకవేల పవర్ స్టార్ బాటలో ఆయన నడిస్తే… టీవీనైన్ ను అమ్మే ఉద్దేశం శ్రీని రాజు కు ఉండొచ్చు. ఎలాగూ కంపెనీల్ని కొని లాభాలు బాట నడిపించి మాంచి ప్రాఫిట్ తో అమ్మేయడం రాజుకు అలవాటే. సో ఈ తొక్కలో రూమర్స్ కు ఎండ్ కార్డు పడాలంటే రవిప్రకాష్ మాట్లాడాలి. సోషల్ మీడియా ద్వారా నైనా నిజం చెప్పాలా…లేదంటే నెటిజన్లు తలలు పగులటట్టు ఉన్నాయ్..అంతగా బుర్రలు వేడిక్కిపోయాయ్..సో రవి ప్రకాష్ ప్లీజ్ టెల్ మీ సంథింగ్…ఫర్ ఏ బెటర్ జర్నో సొసైటీ ..