చదివేది 7వ తరగతి.. చేసేది 25వేల ఐటీ ఉద్యోగం - MicTv.in - Telugu News
mictv telugu

చదివేది 7వ తరగతి.. చేసేది 25వేల ఐటీ ఉద్యోగం

October 30, 2019

boy..

పన్నెండేళ్ల వయసులో ఎవరైనా స్కూల్‌కి వెళ్లి చదూవుకుంటూ ఉంటారు. కానీ, హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీలో నివసిస్తున్న శరత్ మాత్రం ఒకవైపు స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతూ మరోవైపు రూ.25వేల గౌరవ వేతనంతో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం శరత్ అతని చదువుకు ఆటంకం రాకుండా ఉండేందుకు వారంలో మూడు రోజులు మాగ్నైట్ సంస్థలో డేటా సైంటిస్టుగా పని చేస్తూ, మరో మూడు రోజులు స్కూల్‌కి వెళ్తున్నాడు. ఈ విధంగా ఉద్యోగం చేయడానికి శరత్ చదువుతోన్న స్కూల్, మాగ్నైట్ సంస్థ అనుమతిచ్చాయి.

 శరత్ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజ్‌ కుమార్, ప్రియ దంపతుల తనయుడు. అతడి తల్లిదండ్రులు ఇద్దరు క్యాప్‌ జెమినీ సంస్థలో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి శరత్ తల్లిదండ్రులు ల్యాప్ టాప్‌లో పనిచేయడం చూస్తూ పెరిగాడు. దీంతో అతడికి కూడా కోడింగ్, జావాలపై ఆసక్తి పెరిగింది. అందుకు శరత్ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. అలా ఐటీలో ప్రతిభ పెంచుకోని ఏకంగా పన్నెండేళ్ళకే ఉద్యోగం సంపాదించాడు. ఇక శరత్ ప్రతిభను గురించి తెలుసుకున్న తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రత్యేకంగా పిలిపించుకుని, అభినందించారు.