కట్టప్పకు ట్వింకిల్ ఖన్నా ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

కట్టప్పకు ట్వింకిల్ ఖన్నా ఫిదా

May 15, 2017

 

బాహుబలి 2 మేనియా ప్రపంచాన్ని ఊపేస్తూనే ఉంది. ప్రముఖ బాలీవుడ్‌ నటి, నటుడు అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్‌ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది.
అందులో భాగంగా సోషల్‌ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది.

తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్‌ ఖన్నా చెబుతోంది.

HACK:

  • Twinkle Kanna Tweets about Bahibali Kattappa Addiction.