పద్మావతిపై రివార్డుకు జీఎస్టీ ఎంత? - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతిపై రివార్డుకు జీఎస్టీ ఎంత?

November 21, 2017

‘పద్మావతి’ మూవీలో నటించిన దీపికా పదుకునే తలను నరికి తెస్తే రూ. 10 కోట్ల నజరానా ఇస్తానని బీజేపీ నేత సూరజ్ పాల్ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా.. పాల్ ప్రకటనపై ట్విటర్లో ఘాటుగా స్పందించారు. ‘నాకు తెలియక అడుగుతున్నాను. ఇంతకీ ఈయన ప్రకటించిన 10 కోట్ల రూపాయల నజరానాకు జీఎస్టీ కలిపే ప్రకటించారా? లేకపోతే జీఎస్టీ మినహాయించి ప్రకటించారా? ఈ సంగతిని దేశం తెలుసుకోవాలనుకుంటోంది..’ అని ట్వింకిల్ ట్వీట్ చేసింది.ఈ సినిమాకు మద్దతిస్తున్నానని, ఇది అఖండ విజయం సాధించాలని మరో ట్వీట్ చేసింది. జీఎస్టీ భారంతో కేంద్రం ప్రజల నడ్డి విరుస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ట్వింకిల్ ట్వీట్ వైరల్ అయింది.