కవల పిల్లలు..మార్కులు కూడా సేమ్ టు సేమ్ - MicTv.in - Telugu News
mictv telugu

కవల పిల్లలు..మార్కులు కూడా సేమ్ టు సేమ్

July 14, 2020

twns

కవలలు అంటే రూపురేఖలు ఒకే విధంగా ఉంటుంది. తరచూ ఒకే రంగు బట్టలు వేసుకుని ఎదుటివారిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కొందరు కవలలు.. కవలలను పెళ్లి చేసుకుంటారు. కానీ, నోయిడాకు చెందిన కవలలు మాత్రం మార్కులు కూడా ఒకేలా తెచ్చుకుంటున్నారు. అదీ ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకం మార్కులు. మానసి, మాన్య మార్చి 3, 2003న జన్మించారు. రూపురేఖలతో పాటు ఇద్దరి గొంతుకలు కూడా ఒకేలా ఉంటాయట. అలాగే ఆహారపు అలవాట్లు, క్రీడలపై ఆసక్తి.. ఇలా అన్నింటిలోనూ వారి అభిరుచి ఒకేలా ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. 

అయితే సోమవారం విడుదలైన 12వ తరగతి సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో ఇద్దరూ 95.8శాతం మార్కులు సాధించారు. ప్రతి సబ్జెక్టులో ఇరువురికి ఒకే రకం మార్కులు రావడం గమనార్హం. ఒకే రూపురేఖలతో ఉండే పిల్లలు ఇప్పుడు ఒకేరకంగా మార్కులు తెచ్చుకోవడంతో వారి తల్లిదండ్రులు ఆశ్చర్యం పోతున్నారు. అటు టీచర్లు, స్కూల్‌ యాజమాన్యం, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.