సన్నీలియోనికి పండంటి కవల పిల్లలు - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోనికి పండంటి కవల పిల్లలు

March 5, 2018

ప్రఖ్యాత శృంగారతార సన్నీలియోని తల్లి అయింది. అద్దెగర్భం ద్వారా పండంటి మగ కవలలను ఈ లోకంలోకి తీసుకొచ్చింది. సన్నీకి ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉంది. మహారాష్ట్రలోని కరువుప్రాంతమైన లాతూర్ నుంచి ఆ చిన్నారిని సన్నీ దత్తత తీసుకుంది. అంతకముందే ఆమె తన భర్త డేనియల్ వెబర్‌తో కలసి సరోగసీకి ప్లాన్ చేసింది. తాజాగా తన ముగ్గురు బిడ్డల ఫొటోలను ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిల్లలను కూడా దత్తత తీసుకున్నారేమో అని నెటిజన్లు డౌట్ పడ్డంతో సన్నీ క్లారిటీ ఇచ్చింది. వారు తన బయాలాజికల్ బిడ్డలేనంది.‘చాలా తక్కువ సమయంలో మా ఇంట్లోకి ముగ్గురు పిల్లలు రావడం సంబరంగా ఉంది.ఆషెర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌లతో మా కుటుంబం సంపూర్ణమైపోయింది. ఈ బుల్లి కవల పిల్లలు కొన్ని వారాల కిందటే పుట్టారు. దేవుడు మాకు చాలా పెద్ద కుటుంబాన్నే ఇచ్చాడు’ అని  అంటూ సన్నీ సోషల్ మీడియాలో తెలపింది.