Twinsa for me..there is no truth in his words: Aaliya
mictv telugu

నాకు ట్విన్సా..అతడి మాటల్లో నిజం లేదు: ఆలియా

July 28, 2022

”నాకూ ట్విన్సా..రణ్‌బీర్‌ జోక్‌ చేశాడు. అతడి మాటల్లో నిజం లేదు. సరదాగా జోక్‌ చేస్తే జనం ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. నాకు ఒక్కరే పుట్టబోతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు వద్దు. అయినా అమ్మాయిలకు పెళ్లయితే ఒక టాపిక్, తల్లి కాబోతోందంటే ఒక టాపిక్‌ ఇలా ఏదైనా టాపిక్కే. పెళ్లి, తల్లవడం అనేది వ్యక్తిగత విషయాలు. ఇవి వృత్తిపరంగా ఎలాంటి ప్రభావం చూపవు” అని ఆలియా భట్ అన్నారు. మరి ఎందుకు ఆమె ఈ మాటలు అంది? రణబీర్ ఏం అన్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే..

ఇటీవలే ఒక ప్రమోషనల్‌ ఈవెంట్‌లో రణ్‌బీర్‌ పాల్గొన్నాడు. ఈ క్రమంలో యాంకర్‌ ఓ సరదా టాస్క్‌ పెట్టారు. ఒక అబద్ధం, రెండు నిజాలు చెప్పాలని కోరారు. దీనికి రణ్‌బీర్‌ స్పందించి ‘ట్విన్స్‌ పుట్టబోతున్నారు’ అంటూ సమాధానం ఇచ్చి, అది నిజమా? అబద్ధమా? అనేది మీరే చెప్పుకోండి అంటూ నవ్వుతూ సమధానం ఇచ్చాడు. అంతే, నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆలియాకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ రణబీర్ వ్యాఖ్యలతోకూడిన వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆలియా భట్ అభిమానులు ట్విటర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. దాంతో షాక్‌కు గురైన ఆలియా..తాజాగా స్పందించింది. తనకు ట్విన్స్ పుట్టబోతున్నారు అనే వార్తలకు చెక్ పెట్టింది. ‘నాకూ ట్విన్సా.. అలాంటిదేం లేదు.. ఒక్కరే’ అంటూ క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్‌ ప్రేమపక్షులు రణ్‌బీర్‌ కపూర్‌–ఆలియా భట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే పెళ్లయిన రెండు నెలలకే తాను తల్లి కాబోతున్నానని ఆలియా, రణవీర్‌లు ప్రకటించి, తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.