Twist in the case of disappearance of a married woman.. identified as having left with a lover
mictv telugu

మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. భర్త మొబైల్ చూస్తుండగా లవర్‌తో జంప్!

July 27, 2022

పెళ్లిరోజు కావడంతో సరదాగా గడిపేందుకు భర్త శ్రీనివాస్ తో పాటు భార్య సాయి ప్రియ విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లి ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తుండగా సాయిప్రియ లవర్‌తో పరారైంది. అయితే సముద్రంలో గల్లంతైనట్లు భర్త శ్రీనివాస్ భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సాయిప్రియ కోసం రెండ్రోజులుగా నేవీ హెలికాప్టర్‌తో అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఎట్టకేలకు ఆమె నెల్లూరులో లవర్‌తో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు.

సాయిప్రియకు శ్రీనివాస్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్‌ఏడీ వద్ద ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే శ్రీనివాస్‌కు ఫోన్ లో మెసేజ్ రావడంతో ఒడ్డు నుంచి వెనక్కి వచ్చి మెసేజ్ చూసుకుని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు. దీంతో తన భార్య సముద్రంలోని కెరటాలకు కొట్టుకుపోయిందని భర్త శ్రీనివాస్ ఆందోళన పడ్డాడు. ఆ రోజే గత ఈతగాళ్ల సాయంతో బీచ్‌లో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. భర్తే ఆమెను సముద్రంలోకి తోసేశారా అనే కొందరు అనుమానం వ్యక్తం చేశారు.