బావిలో శవాలకేసు.. ఆ గంటలో ఏం జరిగిందనేదే మిస్టరీ - MicTv.in - Telugu News
mictv telugu

బావిలో శవాలకేసు.. ఆ గంటలో ఏం జరిగిందనేదే మిస్టరీ

May 23, 2020

bavii

వరంగల్ జిల్లా గొర్రెకుంట ప్రాంతంలోని బావిలో లభ్యమైన 9 శవాల కేసు మిస్టరీగా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. వారిని ఎవరైనా హత్య చేశారా..? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఏం జరిగిందనేది తేల్చే పనిలో పడ్డారు. ఈ చిక్కుముడి వీడితేనే మరణాలకు కారణం తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

వారంతా చనిపోయిన రోజు సాయంత్రం ఏడు గంటలకు మృతుడు మక్సూదు తన ఇంటికి రావాలని షకీల్‌కు చెప్పాడు. అతడు 7.45 ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. అయితే ఆరు గంటలకే నిషా, బుస్రు, ఆలం, సోయాబ్, శ్రీరామ్, శ్యామల సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి.  7.45కు యజమానితో మక్సూద్ ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత అదే రాత్రి 9 గంటలకు అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది. వీరిపై ఎవరైనా విష ప్రయోగం కూడా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. మృతుల సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.  

కాగా పశ్చిమ బెంగాల్, బీహార్‌కు చెందిన ఈ వలస కూలీల మరణాలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. వీరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మృతుల బంధువులు పశ్చిమ బెంగాల్‌లో తుపాను కారణంగా చిక్కుకుపోవడంతో వారు వరంగల్ వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. క్లూస్ టీం వచ్చి అక్కడ ఉన్న ఆధారాలను సేకరించింది. మక్సూద్ ఇంటిలో ఉన్న అన్నం కూడా పోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. రాగా మక్సూద్ తన కుటుంబంతో కలిసి గత కొన్ని రోజులుగా గొర్రెకుంటలో గోనె సంచులు కుడుతూ జీవిస్తున్నాడు. వారితో పాటు పక్కనే మరో ఇద్దరు బిహార్ యువకులు ఉంటున్న సంగతి తెలిసిందే.