శ్యామ్‌కు కోర్టు షాక్.. నకిలీ పత్రాలతో బెయిల్ పొంది.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్యామ్‌కు కోర్టు షాక్.. నకిలీ పత్రాలతో బెయిల్ పొంది..

June 29, 2020

Shyam K Naidu.

నటి సాయిసుధ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు కేసు రోజురోజుకు ముదురుతున్నట్టుగానే ఉంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితురాలు సాయిసుధతో తను రాజీ కుదుర్చుకున్నట్లు నాంపల్లి కోర్టులో శ్యామ్‌ బెయిల్‌ ఫిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో అతడికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.  అయితే శ్యామ్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సాయిసుధ కోర్టును ఆశ్రయించారు. దొంగ సంతకం పెట్టి బెయిల్‌కు తాను ఒప్పకున్నట్లు ఓ నకిలీ పత్రాన్ని సృష్టించాడని న్యాయస్థానానికి బాధితురాలు విన్నవించుకున్నారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం శ్యామ్ ‌కే నాయుడు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో అతడు మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. 

కాగా, తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సాయిసుధ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌ కే నాయుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్‌కు వెళ్లిన రెండు రోజుల్లోనే సాయిసుధ ఫోర్జరీ సంతకంతో శ్యామ్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.