11 ఏళ్ల బాలుడిని తండ్రిని చేసిన యువతి.. అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

11 ఏళ్ల బాలుడిని తండ్రిని చేసిన యువతి.. అరెస్ట్..

October 20, 2019

ఓ 28 ఏళ్ల మహిళ చేసిన ఘనకార్యానికి 11 ఏళ్ల బాలుడు తండ్రి అయ్యాడు. ఆమె తల్లి అయ్యానని ఆనందంగా వుంది. కానీ, ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనకకు నెట్టారు. 11 ఏళ్ల బాలుడిని లైంగికంగా వాడుకోవడం చట్టరీత్యా నేరం అని పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమెకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మారిస్సా మౌరీ అనే యువతి మూడేళ్ల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత మూడేళ్లుగా (2014 నుంచి) ఆమె 11 ఏళ్లు వున్న బాలుడితో లైంగిక సంబంధాన్ని ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో వెలుగులోకి వచ్చింది.

11-year-old baby.

అయితే వీరి మధ్య సంబంధం ఈమధ్యే బయటపడింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కొడుకుని సంరక్షణలోకి తీసుకుని నిందితురాలిని జైలుకి తరలించారు. కేసు నమోదు చేసుకుని  విచారణ చేస్తున్నారు పోలీసులు తెలిపారు. కాగా, బాధిత బాలుడి ప్రస్తుత వయసు కేవలం 14 సంవత్సరాలే. అతను పాఠశాల విద్యను కొనసాగిస్తున్నాడు.