Twitter CEO Parag Agrawal fired by Elon Musk, but he is leaving a very rich man
mictv telugu

మస్క్ ఫైరింగ్.. ట్విటర్ పరాగ్ అగర్వాల్ తొలగింపు..

October 28, 2022

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను సొంతంచేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ప్రతాపం చూపుతున్నాడు. ఉద్యోగులను తొలగించనని హామీ ఇచ్చిన ఆయన పెద్ద చేపలపై వేటు వేశాడు. ట్విటర్ డీల్ విషయంలో తనను ఇబ్బందిపెట్టిన వారి పనిపట్టాడు. ట్విటర్ సీఈఓ, భారత సంతతి సాఫ్ట్ వేర్ నిపుణుడైన పరాగ్ అగర్వాల్, భారత సంతతికే ట్విటర్ లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ విభాగం అధిపతి విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, జనరల్ కౌన్సెల్ సియాన్ ఎడ్జెట్‌లను తదితరులకు ఉద్వాసన పలికారు. ట్విటర్ కొనుగోలు విషయంలో వీరు తనను తప్పుదారి పట్టించారని మస్క్‌కు పిచ్చికోపం. తొలగించారు. 2021 నవంబరులో ట్విటర్ సీఈఓగా బాధ్యతలు అందుకున్న పరాగ్ అగర్వాల్ కు ఆ పదవి పోవడం మరింత అదృష్టమే అనుకోవచ్చు. ఏడాదిలోపల తనను తప్పిస్తే తనకు రూ. 345 కోట్లు చెల్లించాలని నియామక ఒప్పందలో ఆయన షరతు పెట్టాడు. మస్క్‌కు అది చిన్నమొత్తమే.

మస్క్ 44 బిలియన్ డాలర్లు(3.6 లక్షల కోట్లు)కు ట్విటర్లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆరు నెలల ఫైనాన్స్, కేసులు గొడవ తర్వాత శుక్రవారం ఒప్పందం పూర్తయింది. ట్విటర్ చెత్తకుప్పగా మారే అవకాశముంది, సాధ్యమైనంతవరకు బాగు చేస్తానని మస్క్ అన్నారు. కేవలం మానవత్వంతోనే దాన్ని కొన్నానని, అది మానవ నాగరికతలో కీలక మలుపు అని పొడుగుతూనే ప్రయత్నిస్తానని తనను అడ్డుకున్నవారిపై వేటు వేశారు.