లక్షలమందిని చంపే హక్కు ముస్లింలకు ఉంది.. మాజీ ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

లక్షలమందిని చంపే హక్కు ముస్లింలకు ఉంది.. మాజీ ప్రధాని

October 30, 2020

Twitter Deletes Ex-Malaysian PM's Tweet

ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలోని చర్చిలో నిన్న కొందరు ఇస్లామిక్ అతివాదులు మహిళ గొంతు కోశారు. అలాగే మరో ఇద్దరిని హతమార్చారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. దాడి సందర్భంగా దుండగులు ‘అల్లాహూ అక్బర్’ అంటూ నినదించారు. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు ఫ్రాన్స్‌లోని ఓ స్కూల్ టీచర్‌ను కొందరు ఇస్లామిక్ అతివాదులు గొంతు కోసి హతమార్చారు. ఫ్రాన్స్‌లో వరుసగా జరుగుతోన్న ఇలాంటి సంఘటనలతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై మలేసియా మాజీ ప్రధాని మెహతిర్ మెహమ్మద్ తీవ్రంగా స్పందించారు. మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను పిల్లలకు చూపించిన టీచర్ తల నరకడాన్ని సమర్థించారు. ఇతరులను కించపరచడం భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రాదన్నారు. ఆగ్రహంతో ఉన్నవారు మనుషులను చంపుతారని తెలిపారు. దానికి మతంతో సంబంధం లేదన్నారు. 

ఫ్రెంచ్ చరిత్రలో ఎంతో మంది హత్య చేయబడ్డారని తెలిపారు. అలా హత్యకు గురైనవారిలో అత్యధికులు ముస్లింలని వెల్లడించారు. ఫ్రాన్స్‌లో లక్షలాది మందిని చంపే హక్కు ముస్లింలకు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మహతిర్ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ మంత్రి సెడ్రిక్ వెంటనే స్పందించారు. ట్విట్టర్ ఫ్రాన్స్ ఎండీతో మాట్లాడారు. మహతీర్ ట్విట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో, ట్విట్టర్ సంస్థ మహతీర్ ట్వీట్లను తొలగించింది. మహతీర్ హింసను పెంచేలా ట్వీట్ చేసి తమ నిబంధనలను అతిక్రమించారని ట్విట్టర్ తెలిపింది.