Twitter employees who don't want a job
mictv telugu

మస్క్‌కు గట్టి షాక్..ట్విట్టర్‌‌ను వీడనున్న ఉద్యోగులు

November 18, 2022

ఎలాన్ మస్క్ వచ్చాక ట్విట్టర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఊహకందని నిర్ణయాలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు మస్క్ మామ. రాగానే వేలాదిగా ఉద్యోగులను తొలగించి షాక్ ఇచ్చాడు. ఇటు యూజర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బ్లూ టిక్ కొరకు డబ్బులు చెల్లించాలని కొత్త రూల్ పెట్టాడు. ఉద్యోగుల పనివేళల్లో భారీ మార్పులు చేసి పని గంటలను పెంచేశాడు. కష్టపడి పనిచేయాలని లేదా ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించాడు.

కొత్త బాస్ ఆలోచనలు, రూల్స్ పై ట్విట్టర్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగుల్లో సగం మంది తమ జాబ్‌ను వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వర్క్ ప్లేస్ యాప్ ‘బ్లైండ్’ నిర్వహించిన పోల్‌లో 180 మంది ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడగా 7 శాతం మంది సంస్థను అంటిపెట్టుకుని ఉండేందుకే ఓటు వేశారు.

ఉద్యోగులు పెద్దమొత్తంలో కంపెనీని వీడాలనుకుంటున్నట్టు వార్తలు రావడంతో సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసి బ్యాడ్జ్ యాక్సెస్ తగ్గించనున్నట్టు కంపెనీ నుంచి ఉద్యోగులకు సమాచారం అందింది.ఈ నేపథ్యంలో అన్ని ట్విట్టర్ కార్యాలయాలు మూతపడుతున్నాయి.