Suspicious death of Lady Doctor at Nizamabad Government Hospital
mictv telugu

ఎలన్ మస్క్ ఎఫెక్ట్.. ఇద్దరు ట్విట్టర్ అధికారులకు చెక్

May 13, 2022

Twitter fires two top managers, hiring halts amid Elon Musk buyout turmoil

గత కొన్ని రోజులుగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ గురించి మీడియాలో తరచూ వార్తలు వస్తున్నాయి. ఎలన్ మస్క్.. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి… తన చేతుల్లోకి తీసుకుంటే భారీ మార్పులు జరుగుతాయనుకుంటున్న తరుణంలోనే ఊహించని మార్పులు జరిగాయి. ట్విటర్‌ ప్రస్తుత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను బయటకు పంపుతారని అనుకుంటుండగా అంతకు ముందే.. టీమ్స్‌ను లీడ్ చేస్తున్న ఇద్దరు అధికారులను పరాగ్ తొలగించడం సంచలనంగా మారింది.

ట్విటర్‌ హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్ట్‌గా పని చేస్తున్న టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌ బెక్‌పూర్‌ని సంస్థను వీడ వెళ్లాల్సిందిగా సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ కోరాడట. అదే విధంగా రెవెన్యూ హెడ్‌ బ్రూస్‌ ఫలాక్‌ను కూడా జాబ్ నుంచి తొలిగించారు. . కాగా.. ఇది తన ఇష్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పని అని బెక్‌పూర్‌ వెల్లడించారు. “నిజం ఏంటంటే.. ట్విట్టర్తో నా బంధం ఇలా ముగించాలని నేను అనుకోలేదు. సీఈఓ పరాగ్ అగర్వాల్ నాతో మాట్లాడాను. నేను సంస్థలను వదిలేయాలని చెప్పారు,” అని కేన్ అన్నారు. అదే సమయంలో.. బిజినెస్లో కీలకమైన పదవులకు తప్పించి, ఈ వారం నుంచి నియామకాలను నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ వెల్లడించింది.