Twitter has raised eight dollar subscription due to fake accounts
mictv telugu

ఫేక్ అకౌంట్ల దెబ్బకు ఎనిమిది డాలర్ల సబ్ స్క్రిప్షన్ను ఎత్తేసిన ట్విట్టర్

November 12, 2022

ట్విట్టర్ లో మార్పులు వరుస పెట్టి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం మొదలుపెట్టిన ఎనిమిది డాలర్ల సబ్ స్క్రిప్షన్ ను ఇప్పడు ఎత్తేసినట్టు ట్విట్టర్ అధికారులు శుక్కవారం ట్వీట్ చేశారు. ఈ సబ్ స్క్రిప్షన్స్ వల్ల వరుసగా ప్రాబ్లెమ్స్ రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మామూలు వ్యక్తులు కూడా పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లను పెట్టుకుని ఖాతాలను తెరుస్తుండడం… తర్వాత అవి ఫేక్ అని తేలుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్ అధికారులు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే ట్విట్టర్ లో ఖాతాలు ఉన్నవాళ్ళకు మాత్రం ఏ ఇబ్బందీ ఉండదనీ…కొత్తగా వచ్చేవాళ్ళని మాత్రం అనుమతించమని చెబుతున్నారు. అలాగే హై ప్రొఫైల్ ఉన్న ఖాతాదారులకు అధికారిక బ్యాడ్జ్ లను కూడా ఇవ్వనున్నామని తెలిపింది. ముఖ్యమైన వ్యాపార సంస్థలకు, మీడియాల ప్రొఫైల్ కింద బూడిద రంగు బ్యాడ్జ్ ఉంటుందని చెప్పింది.

సబ్ స్క్రిప్షన్ చెల్లించిన అందరికీ బ్లూ బ్యాడ్జ్ ఇవ్వడం వల్లనే సమస్యలు వచ్చాయని ట్విట్టర్ అధికారులు అంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీల పేర్లు పెట్టుకుని ఖాతాలు తెరిచిన కొన్నింటిలో అభ్యంతరమైన పోస్ట్లు ఉండడంతో దీనిని గుర్తించామని అన్నారు. ఇలా ప్రముఖ కంపెనీ పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచేవారు, ఆవిషయాన్ని తప్పనిసరిగా మెన్షన్ చేయాలని లేకపోతే ఆ ఖాతాలను తీసేస్తామని హెచ్చరించారు.