Twitter outage: Twitter Web is crashing for many users
mictv telugu

మొన్న వాట్సప్.. నిన్న ఇన్‌స్టాగ్రామ్.. నేడు ట్విటర్.. ఎందుకిలా?

November 4, 2022

Twitter outage: Twitter Web is crashing for many users

మొన్న వాట్సాప్‌ సేవలు గంటన్నరపాటు నిలిచిపోవడం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో చెప్పాల్సిన పనిలేదు. మూడ్రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి సమస్యే రాగా.. యూజర్లకు క్షమాపణలు చెబుతూ.. ఆ ప్రాబ్లెంను క్లియర్ చేసింది. అయితే తాజాగా ట్విట్టర్‌ వంతు వచ్చింది.శుక్రవారం ఉదయం ట్విటర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లను లాగిన్‌ సమస్య ఇబ్బంది పెట్టింది. యూజర్లు లాగిన్‌ అవుతోన్న సందర్భంలో ఎర్రర్‌ మెసేజ్‌ దర్శనమివ్వడంతో అసౌకర్యానికి గురయ్యారు. అయితే మొబైల్‌ యూజర్లకు ట్విటర్‌లాగిన్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు.

డెస్క్‌టాప్‌ యూజర్లకు ‘సమ్‌థింగ్‌ వెంట్ రాంగ్‌’ అనే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తోంది. అయితే సమస్యకు గల కారణం ఏంటి అనే దానిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలన్ మస్క్‌ సంస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బ్లూటిక్‌కు ఛార్జీలు వసూలు చేయడం, ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల కోత వంటి నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే వారం నుంచే ట్విటర్‌ బ్లూటిక్‌ ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలుకానున్నట్లు సమాచారం.