కివీస్‌తో టెస్ట్ జట్టులో రాహుల్‌కు నోఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

కివీస్‌తో టెస్ట్ జట్టులో రాహుల్‌కు నోఎంట్రీ

February 4, 2020

ragh

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు టీమిండియా షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్‌ చేసి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా..టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతుండగా రాహుల్‌ను టీమ్‌లోకి తీసుకోలేదు. ఆంధ్ర టీమ్ కెప్టెన్ హనుమ విహారి సెంచరీ చేసి అదరగొట్టి తన స్థానాన్ని కైవస పరుచుకున్నాడు. అయితే హనుమ విహారీ, రాహుల్‌లు టీమ్‌లో కొనసాగుతారని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ, రాహుల్‌కు నిరాశే మిగిలింది. రాహుల్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు.

మరోవైపు సీనియర్స్ అయిన భారత స్టార్ ఓపెనర్స్ రోహిత్, ధావన్ గాయాలతో టీమ్‌కు దూరమయ్యారు. ఇదిలావుండగా ఊహించిన విధంగా డోపింగ్ టెస్టులో బుక్ అయిన పృథ్వీ షా ..నిషేదం అనంతరం మళ్లీ సూపర్ ఫామ్‌తో జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 

యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్​- ఏ తో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో డబుల్‌ సెంచరీతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ప్రస్తుతం భారత తుది జట్టులో

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), అజింక్య రహానే (వైస్​ కెప్టెన్​), వృద్ధిమాన్​ సాహా (కీపర్​), పృథ్వీ షా, శుభ్​మన్​ గిల్​, మయాంక్​ అగర్వాల్​, చటేశ్వర్​ పుజారా, హనుమ విహారీ, రిషబ్​ పంత్​, రవిచంద్ర అశ్విన్​, రవీంద్ర జడేజా, నవదీప్​ సైనీ, మహ్మద్​ షమి, ఇషాంత్​ శర్మ, జస్ప్రిత్​ బుమ్రా, ఉమేశ్​ యాదవ్​ తదితరులు ఉన్నారు.